English | Telugu
షాకింగ్ అండ్ సెన్సేషనల్.. ఎక్కడెక్కడ సెక్స్ చేశాడో బయటపెట్టేసిన విజయ్!
Updated : Jul 29, 2022
కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'కాఫీ విత్ కరణ్ 7'లో గెస్ట్‌గా వచ్చిన విజయ్ దేవరకొండ తాను సెక్స్ చేసిన అత్యంత బహిరంగ ప్రదేశం "ఒక పడవ" అని వెల్లడించాడు. ఈ షో నాలుగో ఎపిసోడ్‌లో 'లైగర్' హీరోయిన్ అనన్య పాండేతో కలిసి వచ్చిన విజయ్, ఆ పడవ నిజానికి "చిన్న ఓడ లాంటిది" అని స్పష్టం చేశాడు. "సముద్రం మధ్యలోనా? Nobody else or like... ?" అన్న కరణ్ కామెంట్‌కు అతను స్పందించాడు. విజయ్ సమాధానం విన్న కరణ్, అది చాలా సెక్సీగా ఉందని వ్యాఖ్యానించగా, "ఇలాంటివన్నీ నేను చేయను" అని అనన్య అంది.
వెంటనే అనన్య కామెంట్‌ను పట్టేసుకున్నాడు కరణ్. "పబ్లిక్ ప్లేస్‌లో ఎప్పుడూ శృంగారం నెరపలేదా?" అని ఆమెను అడిగాడు. "నేను అలాంటిది చెయ్యలేదు" అని అనన్య చెప్పింది. తన తల్లితండ్రులు - బాలీవుడ్ యాక్టర్ చంకీ పాండే, కాస్ట్యూమ్ డిజైనర్ భావనా పాండే - ఈ షోని చూడబోతున్నారని కూడా ఆమె అంది.
కరణ్ పన్నిన ట్రాప్‌లో ఆమె చిక్కుకుందని స్పష్టమైపోయింది. వచ్చిన అవకాశాన్ని కరణ్ వదులుకోలేదు. "అయితే వాళ్లు ఏమనుకుంటారు? తమ ఇంట్లో ఒక శుద్ధమైన కన్య ఉందని!" అన్నాడు.
తాను కార్లలో సెక్స్ చేశానని దేవరకొండ బయటపెట్టాడు. దానికి కరణ్, "అయితే వారు (విజయ్ పార్టనర్) అసౌకర్యంగా లేరా? నేనైతే కారులో ఏమీ చేయలేదు." అంటూ స్పందించాడు. "డెస్పరేట్ టైమ్స్" అంటూ కన్నుగీటాడు విజయ్. ఇప్పుడు దేశంలోనే అత్యంత సెక్సీయెస్ట్ సింగిల్ మ్యాన్‌గా పరిగణించబడుతున్న విజయ్, తాను రష్మిక మందన్నతో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన రూమర్స్ గురించి సూటిగా మాట్లాడాడు.
తన కెరీర్‌లోని తొలి దశలో తామిద్దరం కలిసి రెండు సినిమాలు చేశామని, అప్పటి నుంచి తాము మంచి స్నేహితులమని చెప్పాడు. "ఆమె డార్లింగ్. ఆమె అంటే నాకు ఇష్టం. ఆమె నాకు నిజంగా మంచి ఫ్రెండ్" అన్నాడు.
