English | Telugu

కొబ్బరికాయ బదులు తలకాయ కొట్టిన విజయ్‌ దేవరకొండ!

విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ‘గీత గోవిందం’ చిత్రానికి పూర్తి భిన్నంగా ఫ్యామిలీతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది.
‘లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు... టైమ్‌కి లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపించడాలనుకున్నావా... సెటిల్‌మెంట్‌ అంటే’ అని విలన్‌ అజయ్‌ఘోష్‌ అన్న డైలాగ్‌కి విజయ్‌దేవరకొండ ఆన్సర్‌ ఇస్తూ ‘భలే మాట్లాడతారన్నా మీరందరూ.. ఏ.. ఉల్లిపాయలు కొంటే,. వాడు మనిషి కాదా.. పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. ఐరనే వంచాలా ఏంటి’ అంటూ అక్కడే ఉన్న ఒక ఐరన్‌ పైప్‌ను చేత్తో వంచేస్తాడు.. ఆ తర్వాత అడ్డొచ్చిన విలన్‌ అనుచరుడి తలను గోడకేసి గట్టిగా కొట్టి ‘సారీ బాబాయ్‌.. కంగారులో కొబ్బరికాయ తేవడం మర్చిపోయాను... తలకాయ కొట్టేసాను’ అంటాడు. ఈ గ్లింప్స్‌ సినిమా మీద ఎంతో ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తోంది. విజయ్‌ దేవరకొండను ఒక కొత్త యాంగిల్‌లో చూపించేందుకు పరశురామ్‌ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ ‘గీత గోవిందం’ చిత్రాన్ని మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్‌ చేసాడో తెలిసిందే. మరోసారి అతన్నే తన సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంచుకున్నాడు పరశురామ్‌. దానికి తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదరగొట్టాడు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.