English | Telugu
వెంకటేష్ బాబు బంగారంలో ఐటెం సాంగ్
Updated : Mar 17, 2016
మారుతి ఫ్యామిలీ సినిమాలు తక్కువేతీశాడు. కానీ అవన్నీకూడా ప్రేక్షకుల అభిమానాన్ని చూశాయి. ప్రస్తుతం భలే భలే మగాడివోయ్ సక్సెస్ తో జోష్ మీదున్న మారుతి అదే జోష్ ను విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కిస్తున్న బాబు బంగారంలో చూపించాలనుకుంటున్నాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ పోలీస్ గెటప్ లో కనిపిస్తారని సమాచారం. వెంకీ సరసన నయనతార నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మాస్ జనాల కోసం సినిమాలో ఒక ఐటెం సాంగ్ ను పెట్టబోతున్నాడట మారుతి. 'పాండవుల్లో ఒకడు ' సినిమాను తమిళం నుంచి తెలుగులోకి తీసుకొచ్చినమారుతికి ఆ సినిమా హీరోయిన్ సోనమ్ బజ్వా నటన బాగా నచ్చిందని, అందుకే ఆమెను వెంకీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించాలని డిసైడయ్యాని సమాచారం. ప్రస్తుతం సుశాంత్ తో ' ఆటాడుకుందాం రా ' అనే సినిమా చేస్తోంది సోనమ్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బాబు బంగారం మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.