English | Telugu
నయన క్వీన్ ఛాన్స్ కు నో చెప్పిందట
Updated : Mar 17, 2016
2014 లో వచ్చిన బాలీవుడ్ ఫిల్మ్ క్వీన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డల్ గా సాగుతున్న కంగనా రనౌత్ కెరీర్ కు రాకెట్ బూస్ట్ ఇచ్చిన సినిమా అది. ఫిమేల్ ఓరియెంటెడ్ చిన్న సినిమాగా వచ్చి, భారీ విజయాన్ని సొంతం చేసుకున్న క్వీన్ ను డైరెక్టర్ త్యాగరాజన్ సౌత్ లో రీమేక్ చేయాలనుకున్నారు. దానికి సంబంధించి తెలుగు, తమిళ, మళయాళ రీమేక్ రైట్స్ ను కూడా ఆయన దక్కించుకున్నారు. మూడు భాషల్లో కలిపి ఒకేసారి రిలీజ్ చేసేలా, సౌత్ లో ఫ్యామస్ అయిన హీరోయిన్ ఎవరా అని ఆలోచించి, ఎట్టకేలకు నయనతారను సంప్రదించారట త్యాగరాజన్. ఆల్రెడీ సూపర్ హిట్స్ తో, కొత్త కొత్త ఆఫర్స్ తో మాంచి ఊపు మీదున్న నయనకు కెరీర్ కు క్వీన్ మరింత ప్లస్ అయ్యేదే. కానీ నయన్ డైరెక్ట్ గా నో చెప్పేసిందట. అందుక్కారణమేంటి అరి అడిగితే, తనకు డేట్స్ అసలు ఖాళీయే లేవని కండబద్ధలు కొట్టేసిందట నయన్. అదండీ సంగతి. మరి తర్వాత ఈ ఛాన్స్ ఎవరిని వెతుక్కుంటూ వెళ్తుందో చూడాలి.