English | Telugu
వెంకటేష్, త్రిష మూవీ ప్రారంభం
Updated : Apr 5, 2011
ఈ వెంకటేష్, త్రిష జంటగా నటిస్తున్న చిత్రానికి కోన వెంకట్ సంభాషణలు వ్రాస్తుండగా, తమన్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ బెల్లం కొండ సురేష్ నిర్మించిన "నాగవల్లి" చిత్రం తర్వాత అదే బ్యానర్ లో తాను నటిస్తున్న రెండవ చిత్రమనీ, త్రిషతో మూడవ చిత్రమనీ, ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనీ, అలాగే ఇండియా వరల్డ్ కప్ గెలవటం చాలా ఆనందంగా ఉందనీ, తాను ప్రతి మ్యాచ్ నీ దగ్గరుండి చూడడంతో అక్కడ టీమిండియాని ఛీరప్ చేయటానికి అరిచి అరిచి గొంతు పోయిందనీ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో ఇంకా త్రిష, తమన్, మలినేని గోపీచంద్, బెల్లంకొండ సురేష్, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.