English | Telugu

రామయ్యతో పాక్ బ్యూటీ చిందులు..?

ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రామయ్యా వస్తావయ్యా". ఈ చిత్రంలో పాకిస్తాన్ హాట్ బ్యూటీ వీణామాలిక్ ఓ ఐటెం సాంగ్ లో నటించనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత, శృతిహాసన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈ నెల చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.