English | Telugu

'VD13' నామకరణం.. ఎప్పుడో తెలుసా?

'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'VD13'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. 2024 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. 'గీత గోవిందం' కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'VD13'పై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ టీజర్ కి సంబంధించిన అప్డేట్ ని మేకర్స్ ఇచ్చారు.

అక్టోబర్ 18, సాయంత్రం 6:30 గంటలకు 'VD13' నామకరణం అంటూ టైటిల్ టీజర్ అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో విజయ్ నీట్ గా డ్రెస్ వేసుకొని స్కూల్ పిల్లలతో కలిసి వెళ్ళడం చూస్తుంటే.. ఇది కూడా 'గీత గోవిందం' తరహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. మరి అదో కాదో తెలియాలంటే అక్టోబర్ 18 వరకు ఎదురు చూడాల్సిందే.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.