English | Telugu

వరుణ్ తేజ్ లోఫర్ కాదు.. "మా అమ్మ మహాలక్ష్మీ"

సినిమా హిట్టో.. ఫట్టో తరువాత సంగతి.. ఫటా ఫట్ సినిమాలు తీశామా లేదా అన్నది పూరి స్పెషాలిటీ. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా "లోఫర్" అని అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మార్చినట్టు తెలుస్తోంది. "లోఫర్" అనే టైటిల్ ను మార్చి "మా అమ్మ మహాలక్ష్మీ" పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా అమ్మ సెంటిమెంట్ తో తెరెకెక్కుతుంది కాబట్టి గతంలో పూరి జగన్నాథ్ సినిమా "అమ్మా నాన్న తమిళమ్మాయి" సినిమా తరహాలో "మా అమ్మ మహాలక్ష్మీ" పేరును మార్చారు. అయితే మాస్ టైటిల్ పెట్టడంలో పూరి జగన్నాథ్ దిట్ట. అలాగే ఈసినిమాకి కూడా "లోఫర్" అని పెట్టారు. కాని ఈ టైటిల్ నిర్మాత సి.కళ్యాణ్‌, రామ్ గోపాల్ వర్మకు అంతగా నచ్చకపోవడంతో వారి సలహా మేరకు ‘మా అమ్మ మహాలక్ష్మి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇంకా ఈ సినిమాలో వరుణ్ తల్లిగా రేవతి తండ్రి పాత్రలో పోసాని కృష్ణమురళి నటిస్తున్నారు. మరి అమ్మ సెంటిమెంట్ తో పెట్టిన "మా అమ్మ మహాలక్ష్మీ" ఎంత వరకూ ఇంప్రెస్ చేస్తుందో..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.