English | Telugu

టైటిల్ సెంటిమెంట్ తో అఖిల్ టెన్షన్ ఎందుకంటే?

అఖిల్ అక్కినేని.. అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్న మరో యువ కెరటం. అఖిల్, సాయేషా హీరో హీరోయిన్లుగా.. వినాయక్ దర్శకత్వంలో.. నితిన్ నిర్మాతగా వస్తున్న సినిమా అఖిల్. ఈ సినిమా ఒక్క అక్కినేని అభిమానుల్లోనే కాదు మిగిలిన వారికి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు అఖిల్ ఒక విషయానికి చాలా టెన్షన్ పడుతున్నాడట. అదేంటంటే సినిమా టైటిల్ విషయంలో. ఎందుకంటే హీరోల పేరుతో టైటిల్స్ వచ్చిన సినిమాలు గతంలో వచ్చాయి. చిరంజీవి తొలి రోజుల్లో వచ్చిన "చిరంజీవి" సినిమా.. అలాగే నాగార్జున కేరీర్ ప్రారంభంలో వచ్చిన "కెప్టెన్ నాగార్జున" సినిమాలు అంతేకాదు మంచు విష్ణు నటించిన విష్ణు సినిమా పెద్దగా ఆడిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. దీనివల్ల ఇప్పుడు అఖిల్ సినిమా కూడా అతని పేరు అఖిల్ తో వస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని టెన్షన్ పడుతున్నాడట. మరి అఖిల్ "అఖిల్" సినిమాతో సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా లేదా అనే విషయం తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.