English | Telugu

మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీ.. ఏం జరగబోతుంది

-ఏం జరగబోతుంది
-శివాజీ ఏం చెప్తాడు
-కమిషన్ ఏమంటుంది


శివాజీ(Sivaji)ఇటీవల మహిళల వస్త్రధారణపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది నటీమణులతో పాటు మహిళా సంఘాలు శివాజీ వ్యాఖ్యలపై భగ్గుమనడంతో పాటు శివాజీ పై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసారు. దీంతో విషయాన్నీ సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ సదరు అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని నిర్ణయించి 27 వ తేదీన శివాజీ వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే ఈ రోజు శివాజీ సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్ళాడు.ఇందుకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విచారణ అనంతరం శివాజీ మాట్లాడుతు నేను అనవసరంగా సలహాలు ఇచ్చి పొరపాటు చేశాను. . రాజ్యాంగం అందరికి సమాన హక్కు ఇచ్చింది. ఈ డిస్కర్షన్ ని ఇంతటితో ముగిద్దాం. నేను మహిళా కమిషన్ అడిగిన వాటికి సమాధానం ఇచ్చాను. మళ్ళీ ఫోన్ చేస్తామని అన్నారు.నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే చెప్పమని కూడా చెప్పాను. ఎవరి అంతరాత్మలకి వాళ్ళకి తెలుసు. ఏం జరుగుతుందో. నా మీద కుట్ర చేసే అవసరం ఎవరకి లేదు. నేను ఎవరికి భయపడను. ఆత్మాభిమానం ఉన్న వాడిని. నాగబాబు గారు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది వినలేదు. అందరికి నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు అని చెప్పుకొచ్చాడు.

also read:హీరోయిన్ల వస్త్రదారణపై నాగబాబు చెప్తున్నది ఇదే.. నేరం ఎవరిది



ఇప్పటికే శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ మాట్లాడుతు మహిళలపై అసభ్యంగా లేదా అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు. శివాజీ వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకున్న అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పషం చేసిన నేపథ్యంలో శివాజీ పై మహిళా కమిషన్ రియాక్షన్ పై ఆసక్తి నెలకొని ఉంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .