English | Telugu

బాబాయ్ తో మెప్పించింది.. మరి అబ్బాయితో

మిర్చిలో ప్రభాస్ కు తల్లిగా నటించి మంచి పేరు కొట్టేసి.. ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కు అత్తగా నటించి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ బిజీగా ముందుకెళ్తుంది. రెమ్యునరేషన్ తో పాటు తనకు నచ్చిన పాత్రలే సెకల్ట్ చేసుకుంటూ చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది ఈ వోల్డ్ బ్యూటీ. అయితే ఇప్పుడు రాంచరణ్ బ్రూస్ లీ సినిమాలో నటించిన ఈమె పాత్రపై ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కు అత్తగా నటించి.. ఇప్పుడు అబ్బాయి చిత్రంలో ఏ పాత్రలో నటించిందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉండగా నదియా మెగా ఫ్యాన్స్ ను చాలా డిజప్పాయింట్ చేసిందట. ఎలా అనుకుంటున్నారా.. రీసెంట్ గా బ్రూస్ లీ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ లో సుమ నదియాను ఇప్పుడు మీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే ఎవరితో నటిస్తారు అని అడిగితే దానికి మెగా ఫ్యాన్స్ అందరూ చిరు పేరు చెబుతుందని అనుకున్నారు.. అంతేకాదు నదియా మాట్లాడేప్పుడు బ్రూస్ లీ సినిమాలో నటించిన అందరి గురించి గుర్తు చేసుకుంది కానీ చిరంజీవి మాత్రం ప్రస్తావించలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అవడమే కాదు నదియాపై కోపంగా కూడా ఉన్నారు. మరి మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసిన నదియా బ్రూస్ లి సినిమాలో తన పాత్రతో ఎంత వరకూ మెప్పిస్తుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.