English | Telugu
నిహారిక ఎంట్రీపై...వరుణ్ సన్సేషనల్ కామెంట్స్
Updated : Oct 22, 2015
స్టార్ కుటుంబం నుంచి ఎంత మంది హీరోలొచ్చినా ఫర్వాలేదు గానీ, హీరోయిన్ అడుగుపెడితే మాత్రం రకరకాలుగా మాట్లాడుకొంటారు ఫ్యాన్స్. ఎందుకో.. హీరోయిన్ అంటే గ్లామర్ ప్రదర్శనే అనే ముద్ర బలంగా పడిపోయింది. తమ అభిమాన కథానాయకుడి వారసురాల్ని అలా చూళ్లేక.. హీరోయిన్ల ఎంట్రీపై విముఖంగా ఉంటారు.
అందుకే స్టార్ ఇళ్ల నుంచి హీరోలు వస్తారు గానీ, హీరోయిన్ల రాక చాలా అరుదుగానే జరుగుతుంది. మెగా కుటుంబం నుంచి వస్తున్న నిహారిక ఎంట్రీపై కూడా మెగా అభిమానులు అంతగా సంతృప్తిగా లేరు. `నిహారిక ఎంట్రీపై ఆలోచించండి ` అంటూ అటు నాగబాబుకి, ఇటు మెగా హీరోలకూ మెగా ఫ్యాన్స్ విన్నవించుకొంటున్నారు. అయితే... నిహారిక ఎంట్రీ ఖాయమని, ఎవరేమనుకొన్నా ఆగదని, మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ఏమనుకొన్నా పట్టించుకోమని వరుణ్‌తేజ్ సన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
``నిహారిక కెరీర్ ముఖ్యం. ఎవరో కొంతమంది ఏదో అనుకొంటున్నారని ఆమె ఎంట్రీని ఆపలేం. తనకేం కావాలన్న హక్కు తనకు ఉంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు`` అంటున్నాడు వరుణ్ తేజ్. అయితే.. నిహారిక ఎంట్రీ అందరూ ఆమోదించేలా ఉంటుందని మాటిచ్చాడు వరుణ్. మరి మెగా అభిమానులు వరుణ్ కామెంట్లకు ఎలా స్పందిస్తారో చూడాలి.