English | Telugu
చరణ్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాడా??
Updated : Oct 21, 2015
బ్రూస్లీ సినిమా అటు రామ్‌చరణ్‌లోనే కాదు, ఇటు పంపిణీ దారుల్లోనూ నిరాశ నింపింది. శ్రీనువైట్ల - రామ్‌చరణ్ పై ఉన్న నమ్మకంతో, దసరా సీజన్ తోడవ్వడంతో... ఈ సినిమాని భారీ రేట్లకు కొన్నారు బయ్యర్లు. అయితే వాళ్ల ఆశలన్నీ అడియాశలయ్యాయి. దాదాపు 30 % నష్టాలొచ్చే అవకాశాలున్నాయని టాక్. ఓవర్సీస్ లో అయితే సగానికి సగం పోయే ఛాన్సుంది. దాంతో బయ్యర్లంతా గోల పెడుతున్నారట.
`ఎక్కువ రేట్లకు అమ్మి మోసం చేశారు, మా నష్టాన్ని భర్తీ చేయండి` అంటూ నిర్మాత దానయ్యపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. నిర్మాత నష్టాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో రామ్‌చరణ్ తన పారితోషికం నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని డిసైడ్ అయినట్టు టాక్. ఇది వరకు గోవిందుడు అందరి వాడేలే సినిమాకి దాదాపుగా రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి, బండ్ల గణేష్ ని ఆదుకొన్నాడు.
ఇప్పుడూ అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్సుంది. శ్రీనువైట్లకి ఈ సినిమా కోసం రూ.5 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాడట. ఈ ఫ్లాప్‌కి ప్రధాన కారణమైన వైట్ల కూడా.. ఎంతో కొంత తిరిగి ఇవ్వొచ్చని తెలుస్తుంది. నిజంగా చరణ్, శ్రీనువైట్ల ఈ నష్టాన్ని నెత్తిమీద వేసుకొంటే, నిర్మాత కొంత వరకూ గట్టెక్కే ఛాన్సుంది.