English | Telugu
బాలయ్య మనవడితో ప్రధాని మోదీ ఆట!!
Updated : Oct 22, 2015
అమరావతి శంకుస్థాపన కార్యక్రమ స్థలం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించేందుకు వచ్చిన మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఈ సమయంలో మోదీ బాలకృష్ణ, బాబు గారి మనవడైన చిన్నారి దేవాన్ష్ తో సరదాగా గడపడం అక్కడి ఉన్నవారందని ఆకర్షించింది. మోదీ దేవాన్ష్ చేతిని పట్టుకున్న వెంటనే కేరింతలు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో మోదీ తన కళ్ళజోడును తీసి దేవాన్ష్ పెట్టి కాసేపు ముద్దు చేశారు. భారత దేశ ప్రధాని అయిన మోదీ చిన్నారితో కాసేపు సరదాగా గడపడం అందరిని ఎంతగానో ఆకర్షించింది.