English | Telugu
ఆ బుల్లెట్టు అతడేనంటా..!
Updated : Sep 5, 2013
పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రంలోని "వీడు ఆరడుగుల బుల్లెట్టు" సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఇదే పేరుమీద బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ టైటిల్ ను రిజిస్టర్ చేయించేసారు. అయితే ఈ టైటిల్ కు సరిపడ హీరో ప్రభాస్, మహేష్, పవన్ అంటూ చాలా రకాల పేర్లు వినిపించాయి.
అయితే తాజాగా ఈ పేరుకు సరిపోయే ధీటైన పోటుగాడు, బుల్లెట్టు లాగా దూసుకుపోయే హీరో దొరికేశాడని లేటెస్ట్ టాక్.
ఇంతకీ అతను ఎవరా అని అనుకుంటున్నారా..? అతను మరెవరో కదండీ. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. వరుణ్ అయితే ఈ టైటిల్ కు సరిగ్గా సరిపోతాడని... పవన్ కూడా వరుణ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
మరి వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మాత అశ్వినీదత్ నిర్మించబోయే చిత్రానికి హీరో, టైటిల్ దొరికాయి కానీ.. దర్శకుడు ఎవరు అనే విషయం ఇంకా ఫైనల్ అవలేదు. మరి వీరి కలయికలో రానున్న ఆ దర్శకుడు ఎవరో త్వరలోనే తెలియనున్నది