English | Telugu
అది "డిపార్ట్ మెంట్" కాదు "త్రిశంక్"- వర్మ
Updated : Mar 16, 2011
త్రిశంకు అంటే త్రిశంకుడనేవాడిని విశ్వామిత్రుడు బొందితో స్వర్గానికి పంపటానికి ప్రయత్నించగా, అతన్ని స్వర్గానికి రానీయకుండా భూమి మీదకు తోసేస్తారు. విశ్వామిత్రుడు తలక్రిందలుగా కిందపడుతున్న త్రిశంకుణ్ణి ఆకాశంలో ఆపేసి అక్కడే ఒక కృత్రిమ స్వర్గాన్ని సృష్టిస్తాడు. దాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. అలాగే పోలీసులు కూడా రాజకీయ నాయకులకూ, క్రిమినల్స్ కూ మధ్య త్రిశంకు లాగానే తలక్రిందలుగా వ్రేలాడుతుంటారు అన్న సందేశంతో ఈ చిత్రానికి "త్రిశంకు" అన్న పేరుని నిర్ణయించటం జరిగిందని వర్మ తెలియజేశారు.