English | Telugu
తారక్, చరణ్ వల్ల టైం వేస్ట్ అయింది!
Updated : Dec 11, 2021
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' సందడి షురూ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, డీవీవీ దానయ్య హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. తారక్, చరణ్ అల్లరి కారణంగా షూటింగ్ లో చాలా టైం వేస్ట్ అయిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read:అక్కడ నేనొకదాన్ని ఉన్నాననే ధ్యాసలేకుండా తారక్, చరణ్ తెగ కబుర్లు చెప్పుకునేవారు!
షూటింగ్ టైంలో తారక్ అల్లరి భరించలేం అంటూ గతంలో రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు తారక్ కి చరణ్ తోడవ్వడంతో ఆ అల్లరి పీక్స్ కి వెళ్లిందని రాజమౌళి అంటున్నారు. "ఇద్దరి వయస్సు 30 దాటింది. పెళ్లిళ్లు అయ్యాయి. వీళ్ళ వెనక లక్షల్లో, కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇద్దరు చిన్నపిల్లల్లా కొట్టుకుంటూ అల్లరి చేసేవాళ్ళు. జక్కన్న జక్కన్న అని పిలిచి చరణ్ నన్ను గిల్లాడు అని తారక్ కంప్లైంట్ చేస్తాడు. చరణ్ ఏమో నాకేం తెలీదు అంటాడు. దాదాపు మొత్తం 300 రోజులు షూటింగ్ చేసుంటే, అందులో వీరిద్దరి వల్ల 20-25 రోజులు వేస్ట్ అయ్యాయి" అంటూ రాజమౌళి ఇద్దరు హీరోల గురించి చెప్పగా.. తారక్ కలుగజేసుకొని 'నా మీద దాడి జరుగుతుంటే పెదరాయుడులా ఒక్కసారైనా ఆపారా' అంటూ అంటూ నవ్వులు పూయించారు.
Also read:'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. సీతను పొట్టలో తన్నిన బ్రిటీష్ ఆఫీసర్!
తారక్, చరణ్ అల్లరి గురించి చరణ్ చెప్పడమే కాకుండా.. ఆలియాతో కూడా చెప్పించాడు రాజమౌళి. "ఇద్దరూ కలిసి ఒకటే మాటలు.. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఉంటారు. తారక్ తరచూ చరణ్‌ని ఆటపట్టిస్తుంటాడు. మధ్యమధ్యలో 'జక్కన్నా.. జక్కన్నా' అని ఆయనకు ఏదో చెప్తుంటాడు. చరణ్ ఏమో 'నో.. నో.. 'అంటుంటాడు. అక్కడ నేనొకదాన్ని ఉన్నాననే ధ్యాస కూడా వారికి ఉండేది కాదు." అంటూ ఆలియా చెప్పుకొచ్చింది. రాజమౌళి, ఆలియా చెప్పినట్లు ప్రెస్ మీట్ లో కూడా ఫోటోలు దిగుతున్న సమయంలో తారక్, చరణ్ ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకోవడం కనిపించింది.