English | Telugu
హాస్పిటల్ లో అంజనాదేవి.. వీడియోతో షాకిచ్చిన ఉపాసన..!
Updated : Jun 24, 2025
మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు వార్తలొచ్చాయి. తన తల్లి అనారోగ్యానికి గురైందని తెలిసి.. ఏపీ క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కి పయనమైనట్లు వార్తలు వినిపించాయి. అయితే కొద్దిరోజుల క్రితం కూడా ఇలాగే అంజనాదేవి ఆరోగ్యం గురించి న్యూస్ వచ్చాయి. కానీ, అందులో వాస్తవం లేదని మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. అందుకే తాజా వార్తలు కూడా ఫేక్ అయ్యుంటాయని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో ఓ వీడియోతో షాకిచ్చారు మెగా కోడలు ఉపాసన.
అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ చేస్తోంది మెగా ఫ్యామిలీ. అందులో తెలుగింటి ఆవకాయను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుపుతూ తాజాగా ఓ వీడియోని షేర్ చేశారు ఉపాసన. అందులో అంజనాదేవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కనిపించారు. ముఖ్యంగా అంజనాదేవి తన కోడలు సురేఖ పక్కన కూర్చొని ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ వైపు అంజనాదేవి ఆసుపత్రి పాలైనట్లు వార్తలు వస్తుండగా.. ఆమె ఆనందంగా ఉన్న వీడియోని ఉపాసన షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. బహుశా అంజనాదేవి ఆరోగ్యంగా ఉన్నారని తెలియజేయడం కోసమే ఈ టైంలో ఉపాసన ఈ వీడియో షేర్ చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.