English | Telugu

ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే....

సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సినీ పరిశ్రమను కలచివేసిందీ. మంచి భవిష్యత్ వున్న నటుడు ఆత్మహత్య కు పాల్పడటమేంటి? ఉదయ్‌కిరణ్‌ బలవన్మరణానికి కారణాలేమిటి ? అన్న ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. అయితే తాజాగా ఆయన ఆత్మహత్య చేసుకున్న ఇంతకాలానికి మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఈ నివేదిక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని నిర్ధారించింది. ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డానికి ముందు, మద్యం సేవించాడని అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ, ఊపిరి అందక అతను మృతి చెందాడని తేలింది.