English | Telugu

ఉదయ్ మరణానికి కారణం అదేనా?

నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. ఇదే విషయంపై దర్శకుడు తేజ "ఉదయ్ ను ఎవరు తొక్కేశారో అందరికీ తెలిసిన విషయమే కదా" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం తేజ మాటలకూ అందరు కూడా నిజమేమో అని అనుకుంటున్నారు.

ఎందుకంటే వరుస హిట్ చిత్రాలతో కెరీర్ స్పీడ్ మీద ఉన్న సమయంలో చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం జరిగి, కొన్ని అనుకొని కారణాల వలన రద్దయ్యిన సంగతి తెలిసిందే. తర్వాత ఉదయ్ కి ప్రాధాన్యత తగ్గిపోయిందనేది ఒక వాదనైతే... కావాలనే అతడిని తొక్కేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. అయితే అప్పటి నుంచే ఉదయ్ కు సినిమాల్లో అవకాశాలు కూడా రాలేకపోయాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు తేజ మాట్లతుడూ... "ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, తన ప్రతిభతో గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఉదయ్. తన పరిస్థితి ఇలా తలకిందులు కావడంతో జీర్ణించుకోలేక పోయాడు. ఉదయ్ కిరణ్ మంచి వ్యక్తి. ఒకరికి హానీ చేసేవాడు కాదు. చిత్ర పరిశ్రమలో అతడిని తొక్కేశారా లేదా? అసలు ఎవరు తొక్కేసారన్నది కూడా మీడియాకే ఎక్కువగా తెలుసు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉదయ్ కెరీర్ బాగాలేనందున తనతో ఓ సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరం" అని అన్నారు.