English | Telugu
'టైసన్ నాయుడు'గా బెల్లంకొండ.. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హిట్ ఇచ్చేలా ఉన్నాడు!
Updated : Jan 3, 2024
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన 10వ సినిమాని 'భీమ్లా నాయక్' ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీకి ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ని ఖరారు చేశారు. తాజాగా అధికారికంగా టైటిల్ ని రివీల్ చేసిన మేకర్స్, మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు.
బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు(జనవరి 3) సందర్భంగా విడుదల చేసిన 'టైసన్ నాయుడు' ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఇందులో బెల్లంకొండ డీఎస్పీగా కనిపిస్తున్నాడు. బాక్సింగ్ సన్నివేశాలు, అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ను రూపొందించారు. ఖాకీ చొక్కా వేసుకున్న మైక్ టైసన్ లా బెల్లంకొండ కనిపిస్తున్నాడు. హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న బెల్లంకొండకి.. 'టైసన్ నాయుడు' ద్వారా విజయం లభిస్తుందనే నమ్మకాన్ని గ్లింప్స్ కలిగిస్తోంది.