English | Telugu
'హనుమాన్' కోసం చిరంజీవి.. మెగా ఉత్సవం!
Updated : Jan 3, 2024
ఈమధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రంగా 'హనుమాన్'ని చెప్పుకోవచ్చు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.
'హనుమాన్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం(జనవరి 7) సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించనున్నారు. మెగా ప్రీ-రిలీజ్ ఉత్సవ్ పేరుతో జరగనున్న ఈ వేడుకకు చిరంజీవి హాజరు కానున్నారని సమాచారం.
కాగా, 'హనుమాన్' సినిమాలో హనుమంతుడి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మూవీ టీమ్ దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి హనుమాన్ లో చిరంజీవి కనిపిస్తారో లేదో తెలీదు కానీ, ఆయన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి రావడం మాత్రం సినిమాకి మరింత హైప్ తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదు.