English | Telugu
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన శివారెడ్డి!
Updated : Jan 3, 2024
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు సినీ సెలబ్రిటీలు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి కూడా సీఎంని కలిశారు.
తన సతీమణి స్వాతిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళిన శివారెడ్డి.. పుష్ప గుచ్చం అందించి రేవంత్ రెడ్డికి అభినందలు తెలియజేశారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.