English | Telugu
భల్లాలదేవుడి భార్య ఎవరో తెలుసా..?
Updated : Mar 15, 2016
బాహుబలి లో భల్లాలదేవుడికి కొడుకుంటాడు. కానీ అతని తల్లి ఎవరు అన్నది మాత్రం మనకు కనిపించదు. సెకండ్ పార్ట్ లో భల్లాలదేవుడి భార్య క్యారెక్టర్ కంపల్సరీ వస్తుంది. ఈ పాత్రకు వరస హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న లావణ్య త్రిపాఠిని మొదట అనుకున్నారట. ఆ తర్వాత ఏమైందో ఏమో శ్రియను ఆ పాత్రకు సెలక్ట్ చేశారట మూవీ టీం.
ఇప్పటికే బయట రానా, శ్రియలు ఇద్దరూ బాగా మంచి ఫ్రెండ్స్. ఆ కెమిస్ట్రీ కలిసొస్తుందనేది రాజమౌళి ఆలోచన కావచ్చు. మొదటి పార్ట్ అంతా ప్రతీకారం, ఫ్లాష్ బ్యాక్ లు అయితే, రెండో పార్ట్ లో దేవసేన బాహుబలి మధ్య ప్రేమ, యువరాజులు మహారాజులుగా ఎలా మారారు అనే కథే ఎక్కువ సాగుతుందట. కేవలం క్లైమాక్స్ లో మాత్రమే శివుడి పాత్ర తిరిగి సినిమాలోకి ఎంటరవుతుందని సమాచారం. మరి ది కంక్లూజన్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం, వచ్చే వేసవి వరకూ ఆగక తప్పదు.