English | Telugu
టైగర్ ముందు భారీ టార్గెట్.. రిజల్ట్ ఏమవుతుంది?
Updated : Oct 17, 2023
మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు'. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వంశీకృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ కావడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో 'టైగర్ నాగేశ్వరరావు'పై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ చేసింది.
'టైగర్ నాగేశ్వరరావు' మూవీ వరల్డ్ వైడ్ గా రూ.38 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇది రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్. నైజాంలో రూ.8.60 కోట్లు, సీడెడ్ లో రూ.5.40 కోట్లు, ఆంధ్రాలో రూ.17 కోట్లు బిసినెస్ చేసిన ఈ చిత్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.31 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.4 కోట్లు, ఓవర్సీస్ లో రూ.3 కోట్లు బిజినెస్ తో కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.38 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.
రవితేజ కెరీర్ లో 'రాజా ది గ్రేట్', 'కిక్-2' వంటి సినిమాలు రూ.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేశాయి. అందులో 'రాజా ది గ్రేట్' విజయం సాధించగా, 'కిక్-2' ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఇటీవల కాలంలో రవితేజ సినిమాల్లో రూ.20 కోట్లకు పైగా బిజినెస్ చేసిన సినిమాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. 'రావణాసుర', 'ఖిలాడి' వంటి సినిమాలు రూ.22-23 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేశాయి. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. రూ.20 కోట్ల లోపు బిజినెస్ చేసిన 'క్రాక్', 'ధమాకా' వంటి సినిమాలు భారీ లాభాలతో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మరి ఇప్పుడు 'టైగర్ నాగేశ్వరరావు'తో రవితేజ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.