English | Telugu

పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో రిలీజ్ లో గణేష్

ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ట్రైలర్ లో ఒక డైలాగుంది. అదేంటంటే "రోమియో జూలియట్, లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి వంటి గొప్ప ప్రేమికులు కావాలంటే చచ్చిపోవాలి". ఈ డైలాగ్ ని హీరో పవన్ కళ్యాణ్ చెపుతారు. నిజమే కదా అమర ప్రేమికులెవరూ బ్రతికి తమ ప్రేమను పండించుకోలేదు. వారు చనిపోయి తమ ప్రేమను బ్రతికించుకుని అజరామరం చేశారు.

అనంతరం నిర్మాత గణేష్ చాలా ఎమోషనల్ గా ప్రసంగిస్తూ " ఒకసారి మాట పెదవి దాటిందా...ఆ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న ఆయన తల్లిదండ్రులకు పాదాభివందనం. ఆయన తర్వాతే నా భార్య కూడా. ఆయన రుణం ఎలా తీర్చుకోను. ప్రాణం ఇచ్చా...? గొంతు కోసుకోనా...? రక్తం ఇచ్చా...? ఆయన కోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. ఆయనతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కి పోతుంది. సిగిరెట్, మందు వంటి వ్యసనాల్లా పవన్ కళ్యాణ్ తో పరిచయం అయిన ఎవరికైనా ఆయనతో మాట్లాడటం అనేది ఒక వ్యసనంలా ఉంటుంది.

అలాంటి మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను నిర్మాతను చేశారు. రేపు మీలో ఎవరినన్నా నిర్మాతను చేయగలరు. ఇక మా సత్తిబాబు గారు. నేనున్నాన్రా అని నన్ను ముందుకు నడిపిన వ్యక్తి. ఇక మా సినిమాకి, పవన్ కళ్యాణ్ కేరీర్ లోనే అద్భుతమైన సంగీతాన్నిచ్చిన మణన్నకి నా కృతజ్ఞతలు." అని అన్నారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.