English | Telugu
పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో లైవ్ లో
Updated : Mar 18, 2011
ఈ పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియోకి ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుండీ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాదిగా తరలి రానున్నారని ఫిలిం నగర్ వర్గాల కథనం. పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియోని మార్చ్ 21 వ తేదీన, హైదరాబాద్, మాదాపూర్ లోని శిల్పారామంలోకల శిల్ప కళావేదికపై అత్యంత భారీగా,
అత్యంత ఘనంగా జరపటానికి ఈ "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో రిలీజ్ కు మెగాస్టార్, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.