English | Telugu

బామ్మ‌తో క‌లిసి అదా శ‌ర్మ చెప్తున్న తిండి క‌బుర్లు!

అదా శ‌ర్మ లైఫ్ స్టైల్‌ను అబ్జ‌ర్వ్ చేసేవాళ్ల‌కు ఆమె ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార నియ‌మాల్ని ఇష్ట‌ప‌డుతుంద‌నే విష‌యం తెలుసు. ఆమె చాలావ‌ర‌కు ఇంటి భోజ‌న‌మే చేస్తుంటుంది. ఇది ఆమెకు బామ్మ‌ నుంచి అబ్బిన అల‌వాటు. అదా త‌ర‌చుగా బామ్మ‌తో క‌లిసున్న ఫొటోలు, తామిద్ద‌రూ క‌లిసి చేసే ప‌నుల్ని పోస్ట్ చేస్తుంటుంది. వాటికి లైక్స్ బాగా వ‌స్తుంటాయి కూడా. ఇంట్లో త‌యారుచేసిన తాజా ఆహార ప‌దార్థాల‌పై త‌మ ఇద్ద‌రికీ ఉన్న ఇష్టం గురించి చెప్తుంటుంది అదా.

Also read:అక్క‌డ నేనొక‌దాన్ని ఉన్నాన‌నే ధ్యాస‌లేకుండా తార‌క్‌, చ‌ర‌ణ్ తెగ క‌బుర్లు చెప్పుకునేవారు!

పూరి జ‌గ‌న్నాథ్ 'హార్ట్ ఎటాక్‌'తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన "నేను నేర్చుకున్న ఆ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార అల‌వాట్లు మా బామ్మ‌నుంచి వ‌చ్చిన‌వే. నాలాగే త‌ను కూడా పుట్టిన‌ప్ప‌ట్నుంచీ స్వ‌చ్ఛ‌మైన శాకాహారి. శాకాహారం మ‌న‌సును, శ‌రీరాన్ని ఆరోగ్య‌క‌రంగా ఉంచుతుంద‌నీ, చ‌ర్మాన్నీ, జుట్టునూ ప్ర‌కాశ‌వంతంగా ఉంచుతుంద‌నీ నేను గ్ర‌హించాను." అని తెలిపింది. వారి మెనూలో ద‌క్షిణాది ప‌దార్థాలు చాలానే ఉంటాయి. "మా బామ్మ ఎక్కువ‌గా ఇంట్లో వండిన వాటినే.. అందులోనూ త‌ను వండిన వాటినే.. తింటుంది. ప్ర‌ధానంగా ఇడ్లీలు, దోసెలు, సాంబార్‌, మున‌క్కాయ‌, ర‌సం, అన్నం, వివిధ‌ర‌కాల కూర‌గాయ‌లు మా ఆహారంలో ఉంటుంటాయి. వంట‌లో నూనె ఎక్కువ‌గా వాడం. మా ఫుడ్‌లో కొబ్బ‌రి ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల కొబ్బ‌రి వేసిన‌ క‌ర్రీలే ఎక్కువ‌గా మా తిండిలో క‌నిపిస్తుంటాయి. కొబ్బ‌రి నుంచి ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వు, అవ‌స‌ర‌మైన నూనె ఉంటుంద‌ని నేను భావిస్తున్నా" అని చెప్పింది అదా.

Also read:థియేట‌ర్‌లో సినిమా చూడ్డానికి ఆటోలో వ‌చ్చిన శ్రియ‌!

అలా ఇంటి ప‌దార్థాలు అందుబాటులో లేనిచోట‌, క‌ఠిన నియ‌మాలేమీ పాటించ‌కుండా తినాల‌నుకున్న‌ది తినేస్తుంటారు కూడా. మా బామ్మ ఫిలాస‌ఫీ ఏమంటే.. మీరు ఎక్కువ చాక్ల‌ట్లు తింటుంటే, దానివ‌ల్ల ఎన్ని కేల‌రీలు వ‌స్తుంటాయ‌నే లెక్క జోలికి వెళ్లొద్దు. ఆమె అలా జీవిస్తుంది. ఆమెను చూసి నేను ఫాలో అవుతుంటాను. కాబ‌ట్టి, మేం ఎక్కువ చాక్లెట్లు తింటున్న‌ప్పుడు, దాని గురించి ఆలోచించం. మ‌నం వాటి గురించి ప‌ట్టించుకోన‌ప్పుడు కేల‌రీల‌నేవి లెక్క‌లోకి రావు.. అని అనుకుంటున్నాను అని ముగించింది అదా.