English | Telugu

బాల‌య్య - గోపీచంద్ మూవీకి ముహూర్తం ఫిక్స్!

ఈ ఏడాది ఆరంభంలో `క్రాక్`తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని.. ఈ సంవ‌త్స‌రం చివ‌ర‌లో `అఖండ‌`తో సెన్సేష‌న‌ల్ హిట్ సొంతం చేసుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త్వ‌ర‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం తొలిసారిగా జ‌ట్టుక‌ట్ట‌నున్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ ఈ చిత్రానికి బాణీలు అందించ‌నున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ భారీ బ‌డ్జెట్ మూవీని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంది.

మైత్రీకి సామ్ ఫ్యాక్ట‌ర్ మ‌రోసారి ప్ల‌స్స‌య్యేనా!

ఇదిలా ఉంటే.. ఈ పాటికే ప‌ట్టాలెక్కాల్సిన ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల సెట్స్ పైకి వెళ్ళ‌డంలో ఆల‌స్య‌మైంది. కాగా, ఈ చిత్రం జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ బాట ప‌ట్ట‌బోతోంద‌ట‌. తాజాగా ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు న‌వీన్ యేర్నేని, వై. ర‌విశంక‌ర్ తెలియ‌జేశారు. అంతేకాదు.. వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా జ‌నం ముందుకు రాబోతోంద‌ని స‌మాచారం. మ‌రి.. ప్రీవియ‌స్ మూవీస్ తో సెన్సేష‌న్స్ క్రియేట్ చేసిన బాల‌య్య‌, గోపీచంద్.. కాంబినేష‌న్ మూవీతో ఏ స్థాయి విజ‌యాన్ని అందుకుంటారో చూడాలి.

బాల‌య్య‌తో మ‌రోసారి ప్ర‌గ్యా రొమాన్స్!