English | Telugu

`పుష్ప‌` ర‌న్ టైమ్.. త‌గ్గేదేలే!

``త‌గ్గేదే లే`` అంటూ డిసెంబ‌ర్ 17న `పుష్ప - ద రైజ్`తో మాస్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. `ఆర్య`, `ఆర్య 2` త‌రువాత బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో బ‌న్నీ చేసిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ - ఇండియా మూవీగా ఎంట‌ర్టైన్ చేయ‌నుంది.

'ఊ అంటావా మావ'.. సమంత తగ్గేదేలే!

ఇదిలా ఉంటే.. `పుష్ప - ద రైజ్` ర‌న్ టైమ్ ఎంత సేపు ఉంటుందో తాజాగా చిత్ర నిర్మాత‌లు వెల్ల‌డించారు. 2 గంట‌ల 59 నిమిషాల పాటు అంటే దాదాపుగా మూడు గంట‌ల పాటు ఈ సినిమా న‌డుస్తుంద‌ట‌. అయితే, నిడివి ఎక్కువైనా ఎక్క‌డా స్లోగా ఉండ‌ద‌ని, రేసీగా మూవీ సాగుతుంద‌ని వారు తెల‌ప‌డం విశేషం. మ‌రి.. రెండు భాగాలుగా రాబోతున్న `పుష్ప‌`కి ఫ‌స్ట్ పార్ట్ కే ఇంత ర‌న్ టైమ్ ఉంటే.. సెకండ్ పార్ట్ కి ఇంకెంత డ్యూరేష‌న్ ఉంటుందో చూడాలి.

అడ‌వి బాట‌లో అప్ క‌మింగ్ తెలుగు క్రేజీ ప్రాజెక్ట్స్!
కాగా, `పుష్ప - ద రైజ్`లో బ‌న్నీకి జంట‌గా ర‌ష్మికా మంద‌న్న న‌టించ‌గా.. స‌మంత ప్ర‌త్యేక గీతంలో చిందులేసింది. ఫ‌హ‌ద్ ఫాజిల్, సునీల్, అన‌సూయ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించింది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.