English | Telugu
విశ్వక్ సేన్ చేతులమీదుగా 'తెరచాప' ఫస్ట్ లుక్ లాంచ్
Updated : Nov 3, 2023
నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని శ్రీలు కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనన్యా క్రియేషన్స, హరితవనం ఎంటర్‌టైనమెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ "ఈ సినిమా కథ, కథనం, టేకింగ్, నిర్మాణ విలువలు అన్ని విషయాలు నాకు తెలుసు. టైటిల్, పోస్టర్ డిజైనింగ్ చాలా బావుంది. సినిమా బాగా ఆడి ఈ టీమ్ కి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డీఓపీలుగా అజీమ్ - వెంకట్, ఆర్ట్ డైరెక్టర్ గా చరణ్, ఎడిటర్ గా బొడిసింగి రాజు వ్యవహరిస్తున్నారు.