English | Telugu

నాగచైతన్య సినిమాలు

అక్కినేని వంశ నట వారసుడు,ఆ వంశంలో మూడో తరం హీరో అయిన నాగచైతన్య వరసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు.మ్యాక్స్ ఇండియా పతాకంపై, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో,దేవ కట్టా దర్శకత్వంలో, కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం"ఆటోనగర్ సూర్య".ఈ చిత్రం జూన్ లో ప్రారంభం కానుంది.దేవ కట్టా గతంలో "వెన్నెల,ప్రస్థానం" చిత్రాలకు దర్శకత్వం వహించారు.

దీనితో పాటు సంచలన, వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో రానున్న "బెజవాడ రౌడీలు" చిత్రంలో కూడా నాగ చైతన్య హీరోగా నటించటానికి అంగీకరించాడు. ఈ రెండు చిత్రాల కథలూ విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగేవే కావటం విశేషం. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ పతాకంపై,సుకుమార్ దర్శకత్వంలో,అల్లు అరవింద్ నిర్మించే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తూండగా, నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు.


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం