English | Telugu

రియల్ స్టార్ "ముద్ర"లో ఆర్తి

ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రాబోయే "ముద్ర"చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో అమ్మరాజశేఖర్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.అతని సరసన ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ జోడీగా నటిస్తూంది.

ఒకప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ‍, తరుణ్, ఉదయకిరణ్ వంటి స్టార్స్ తో నటించిన ఆర్తి అగర్వాల్ ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ సరసన నటించటం చూస్తుంటే జాలేస్తోంది. దీనికి కారణం ఆమె చేసుకున్న స్వయం కృతాపరాధమే.ఒకప్పుడు తరుణ్ తో ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత ఆత్మహత్యా ప్రయత్నం వంటి విషయాలన్నీ నేటి ఆమె ఈ పరిస్థితికి కారణాలుగా అనుకోవచ్చు. అందుకే అంటారు ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయని.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం