English | Telugu

ఎమ్మెస్‌ నారాయణకు అస్వస్థత

తెలుగు సినిమా ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్‌ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైద్రాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన అనారోగ్యానికి కారణం ఫుడ్ పాయిజనింగ్ అని తెలుస్తోంది. ఎమ్మెస్‌ నారాయణ భీమవరంలో సంక్రాంతి పండుగ జరుపుకొనేందుకు వచ్చినప్పుడు స్థానిక హోటల్లో ఆహారం తీసుకొన్న తరువాత ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారట. అది గమనించిన సన్నిహితులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన గత కొంత కాలంగా కిడ్నీ మరియు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...