English | Telugu
శంకర్ 'ఐ' 5 రోజుల కలెక్షన్స్
Updated : Jan 20, 2015
సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన శంకర్ 'ఐ' సినిమా అనుకున్నంత ఆకట్టుకోలేకపోయిందని విమర్శకులు అంటున్నా..పండగ సీజన్‌ని మాత్రం బాగా క్యాష్ చేసుకుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఈ సినిమా హక్కులు 30 కోట్లకు దక్కించుకోగా, మొదటి ఐదు రోజులలలో ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి 20కోట్లు వసూళ్ళు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే మొదలుకానుంది. పండగ సీజన్ అయిపోవడంతో ఈ సినిమా కలేక్షన్లు ఎలా వుంటాయనేది ఆసక్తికరంగా మారింది. శంకర్ ఐ సినిమా 5 రోజుల కలెక్షన్స్ ఇలా వున్నాయి.
నైజాం రూ. 6.32 కోట్లు
సీడెడ్ రూ. 4.15 కోట్లు
వైజాగ్ రూ. 1.77 కోట్లు
ఈస్ట్ గోదావరి రూ. 1.60 కోట్లు
వెస్ గోదావరి రూ. 1.31 కోట్లు
కృష్ణా రూ. 1.39 కోట్లు
గుంటూరు రూ. 1.90 కోట్లు
నెల్లూరు రూ.1.03 కోట్లు
తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిపి రూ. 19.47 కోట్లు