English | Telugu

తెలంగాణ శకుంతల కన్నుమూశారు



ప్రముఖ నటీ తెలంగాణా శకుంతల (63)ఇక లేరు. శుక్రవారం అర్థ రాత్రి కొంపల్లిలోని తన స్వంత ఇంట్లో గుండెపోటు రావడంతో ఆమెను తన కుంటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దారి మధ్యలో శకుంతల మరణించారు. 1981లో ‘మా భూమి‘ సినిమాతో తెలగు సినీ పరిశ్రమలోకి వచ్చిన శకుంత ఇప్పటి వరకు దాదాపు 70కి పైగా చిత్రాల్లో నటించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులో ఆమె అంత్యక్రియలు జరగవచ్చును. తన అద్భుతమయిన నటనతో తెలుగుచిత్ర సీమకు ఒక నిండుదనం తెచ్చిన తెలంగాణా శకుంతల మరిక లేరనే ఈ వార్తను జీర్ణించుకోవడం కష్టమే.