English | Telugu
తండ్రి టీమిండియా మాజీ కెప్టెన్.. కొడుకు తెలుగులో హీరో
Updated : Apr 9, 2016
క్రికెటర్ కొడుకు క్రికెటరే అవుతాడన్నది పాత సామెత. దీనికి భిన్నంగా థింక్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. తనతో పని చేసిన వారు వాళ్ల పిల్లల్ని క్రికెటర్లుగా చూడాలనుకుంటున్నా ఈయన మాత్రం తన కొడుకుని సినిమా హీరోని చేయబోతున్నాడు. అజారుద్దీన్ కుమారుడు అబ్బాస్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై నాకూ ఓ లవరుంది, దక్షిణ మధ్య భారత జట్టు వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన కె. సురేశ్‌బాబు ఇప్పుడు దర్శకుడిగా మారబోతున్నారు. అబ్బాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఇద్దరికి కొత్తేగా పేరుతో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించబోతున్నారు.ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా జరగనుందని టాక్. బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.