English | Telugu

సూర్య ' మేము ' వాయిదా పడింది

తమిళ స్టార్ సూర్య యాక్ట్ చేసిన పసంగ-2 తెలుగులో మేము అనే పేరుతో డబ్ అయింది. సూర్య, అమలాపాల్, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో సాయి మణికంఠ క్రియేషన్స్ బ్యానర్ పై జూలకంటి మధుసూధన్ రెడ్డి అందిస్తున్నారు. తమిళంలో 2015 వచ్చి హిట్ గా నిలిచిన ఈ మూవీ తెలుగులో రావడానికి మాత్రం టైం తీసుకుంటోంది. గత కొద్ది కాలంగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తున్న మేము ఈ 18న రిలీజ్ కావాల్సి ఉంది. తాజాగా కొన్ని అనివార్య కారణాల కారణంగా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నామని, విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు. దీంతో మేము మరింత వెనక్కి వెళ్లిపోయింది. తిరిగి రిలీజ్ డేట్ ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాల్సి ఉంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.