English | Telugu
సర్దార్ ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా..?
Updated : Mar 16, 2016
పవన్ ఫ్యాన్స్ అందరూ ఏప్రిల్ 8 వరకూ ఆగలేకపోతున్నారు. అందుకే ఈలోపు వాళ్ల ఆకలి కొద్దిగా తీర్చడానికి 20 న ఆడియో ప్లాన్ చేసింది సర్దార్ టీం. దాంతో ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. ఆడియో ఫంక్షన్లో ఫ్యాన్స్ కు కానుకగా, ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుంది..? పవన్ సినిమా అంటే, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేసేవి పంచ్ డైలాగులే. గబ్బర్ సింగ్ లో పవన్ మాట్లాడిన ప్రతీ మాటా పంచ్ లా పేలింది. దాంతో సర్దార్ కు కూడా ఇలాంటి డైలాగ్స్ కంపల్సరీ.
అంతేకాక, చిరంజీవి వీణ స్టెప్ ను పవన్ వేశాడన్న దానిలో ఎంత వరకూ నిజం ఉందో కూడా ట్రైలర్లో తేలిపోనుంది. ఎందుకంటే, అలాంటి సెన్సేషనల్ స్టెప్ పవన్ వేశాడంటే, దాన్ని తప్పని సరిగా ట్రైలర్ లో పెట్టితీరతారు. మొత్తం ట్రైలర్ కు మరో ప్లస్ పాయింట్ దేవీ మ్యూజిక్. టీజర్లకు, మేకింగ్ వీడియోలకు వెనక వినిపించిన దేవి మ్యూజిక్ చించి ఆరేసింది. అంటే ట్రైలర్లో పవన్ సెన్సేషనల్ డైలాగులు, అదిరిపోయే స్టెప్పులు, తిరుగులేని బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సినిమా రిలీజయ్యే వరకూ ఫ్యాన్స్ కు ట్రైలర్ తో పండగే.