English | Telugu

ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అన్న వార్తల్లో నిజం లేదు

ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ కన్ఫామ్ చేశారు జనతా గ్యారేజ్ మూవీ టీం. అంతకు ముందు మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ ట్విట్టర్ ఎకౌంట్లో, ఎన్టీఆర్ ఫెల్ట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అని పోస్ట్ వచ్చింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు, టాలీవుడ్ అంతా కంగారు పడింది.

వెంటనే దాన్ని డీయాక్టివేట్ చేసి, ఇకపై మైత్రీ అఫీషియల్ అన్న పేరుతో ఉన్న ట్విట్టర్ నుంచే తమ అఫీషియల్ అప్ డేట్స్ వస్తాయని, ఫేక్ ఎకౌంట్స్ ను, రూమర్స్ ను నమ్మద్దని ట్వీట్ చేశారు. పైగా నిత్యామీనన్ ఎన్టీఆర్ మధ్యన సీన్స్ షూట్ చేస్తుండటంతో, యాక్సిడెంట్ కు స్కోప్ కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతకూ అసలు ఆ ట్వీట్ ఎవరు ఎందుకు చేశారు అన్నది మాత్రం మిస్టరీగా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.