English | Telugu
సూపర్ స్టార్ లింగా మొదలయ్యింది
Updated : May 2, 2014
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా "లింగా" అనే చిత్రం మొదలయ్యింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు లాంఛనంగా మైసూర్ లోని చాముండేశ్వరి ఆలయంలో ప్రారంభమయ్యాయి. ఇందులో రజిని ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా జతకడుతున్నారు. జగపతి బాబు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.