English | Telugu

ఇప్పటి సినిమాలకు కథ కాకరకాయ లేదంట

'పోకిరి', 'మగధీర', 'మిర్చి', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'... ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. 'మగధీర' వంటి సినిమాలు కొన్ని టాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టాయి. ఇవన్నీ కూడా ఇపుడున్న కాలాన్ని అనుసరించి వస్తున్న చిత్రాలు. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో కథ లేదు కాకరకాయ లేదంటున్నారు సినీ నిర్మాత కెఎస్ రామారావు. ఆయన స్థాపించిన "క్రియేటివ్ కమర్షియల్స్" సంస్థ 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. అంతే కాకుండా ఇపుడు వస్తున్నా సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి అయితే మాత్రం బాగాలేదు అని అన్నారు. 1981లో 'మౌనగీతం' సినిమాతో నిర్మాతగా మారాను. అ తర్వాత చిరంజీవితో 'అభిలాష' తీసాను. అప్పటినుంచి ఇప్పటివరకూ అశ్లీలం, ద్వంద్వార్ధ సంభాషణలకు ఆస్కారం లేకుండా కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వచ్చాం. ఇక మీదట కూడా మా నుంచి అలాంటి సినిమాలే వస్తాయి" అని తెలిపారు.