English | Telugu

'మళ్లీ పెళ్లి' కథకు కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?!

నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'మళ్లీ పెళ్లి'. విజయ కృష్ణా మూవీస్ బ్యానర్‌పై నరేశ్ స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా ఇది వారి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తీసిన సినిమా అనే అభిప్రాయం కలిగించింది. లేటెస్ట్‌గా వచ్చిన ట్రైలర్ అయితే మరింతగా దాన్ని బలపరుస్తోంది. నరేశ్, పవిత్ర.. ఇద్దరూ అప్పటికే వివాహితులు కాగా, మళ్లీ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఆ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

అలాగే "అక్కడ కర్ణాటక మీడియాలో ఇంటింటికీ పాకుతున్న మా ఇంటి పరువును ఏం చేయమంటావ్?" అని పార్వతి పాత్రధారి పవిత్ర ఫోన్‌లో చెప్తుండడాన్ని బట్టి ఆమె పాత్ర ఆమె నిజ జీవిత పాత్ర అనే విషయాన్ని చెప్తుండగా, ఒక సీన్‌లో పవిత్రతో అన్నపూర్ణ," అసలైన సూపర్‌స్టార్ పెద్దాయన, బుల్లి సూపర్‌స్టార్ పెద్దభార్య కొడుకు, నరేంద్ర మేడం గారి కొడుకు" అని చెప్పడాని బట్టి నరేశ్ చేసిన నరేంద్ర క్యారెక్టర్ ఆయన నిజ జీవిత పాత్రను తెలియజేస్తోంది. అయితే ఇది వారి కథేనా? అనడిగితే, ఇలాంటి ఘటనలు సొసైటీలో చాలా జరుగుతుంటాయి అని ఎమ్మెస్ రాజు దాటేయడం, నరేశ్, పవిత్ర కూడా అది తమ కథేనని స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.

ఇది వాళ్ల కథేనని నమ్మేట్లుగా ప్రమోషన్ చేస్తూ, తీరా సినిమాలో అలాంటిది లేకపోతే మేకర్స్ తమను మోసం చేశారని ప్రేక్షకులు భావించే ప్రమాదం ఉంటుంది కదా అని పాత్రికేయులు ప్రశ్నిస్తే, తాము ప్రేక్షకుల్ని మోసం చెయ్యడం లేదనీ, సినిమా చూసిన ప్రేక్షకులెవరూ అలా ఫీల్ కారనీ ఎమ్మెస్ రాజు చెప్పడం మరో ఆసక్తికర అంశం.

కాగా ఈ కథను కృష్ణ గారికి చెప్పామనే విషయాన్ని నరేశ్ బయటపెట్టారు. "కృష్ణ, విజయనిర్మల ఇప్పటికీ జీవించి ఉన్నట్లయితే, ఈ సినిమాని తలపెట్టేవారా? తలపెట్టినా వారు ఒప్పుకొనేవారా?" అనే ప్రశ్నకు, కృష్ణ గారికి ఈ సినిమా కథ తెలుసని నరేశ్ చెప్పారు. ఆయన కథవిని బాగా తీస్తే చక్కని ఎంటర్‌టైనర్ అవుతుందని అన్నారని కూడా నరేశ్ చెప్పారు. అంటే కృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నట్లు ఆయన చెప్పారు.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.