English | Telugu
జక్కన్నగా వస్తున్నాడు, హిట్ కొడతాడా..?
Updated : Mar 2, 2016
అందాల రాముడు సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ కు ఆ తర్వాత మర్యాదరామన్న తప్పితే, సరైన హిట్ పడలేదు. లేటెస్ట్ గా వచ్చిన కృష్ణాష్టమి కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నింది. దీంతో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న తన జక్కన సినిమా మీదే సునీల్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్ అవడం సునీల్ కు ఇప్పుడు అత్యవసరం. అందుకే ఈ భీమవరం బుల్లోడు జక్కన్న కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఆకెళ్ల వంశీకృష్ణ డైరెక్షన్లో సునీల్ చేస్తున్న సినిమా జక్కన్న. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
చిన్న చిన్న కమెడియన్స్ కూడా, కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలు తీసి హిట్ కొడుతుంటే, స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన సునీల్ మాత్రం హిట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. తన సినిమాల్లో, హీరోగా చేస్తూనే తన నుంచి కామెడీని జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని సునీల్ కు ఈ పాటికే అర్ధమై ఉంటుంది. అందుకే, జక్కన్న సినిమా కోసం డైరెక్టర్ తో కలిసి కసరత్తులు చేస్తున్నాడట. కామెడీ డోస్ తో సినిమాను సక్సెస్ చేయాలనేది సునీల్ ఆలోచన. జక్కన్న అనేది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఉన్న నిక్ నేమ్ కావడం విశేషం. ప్రేమకథాచిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ తో మన్నారా చోప్రా జతకట్టబోతోంది. ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న సునీల్ మరి ఈ సారి ఎంత వరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.