English | Telugu
రివ్యూయర్స్ కు సినిమా అంటే ఏంటో తెలియదు - ప్రవీణ్ సత్తారు
Updated : Mar 2, 2016
చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డు గెలిచిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. తన సినిమాలు ఎక్కువగా సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకునే ప్రవీణ్, ఇప్పుడు గుంటూర్ టాకీస్ తో మళ్లీ రాబోతున్నాడు. ఈ సందర్భంగా తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని బయటపెట్టాడు. ఆ విశేషాలు మీకోసం..
రివ్యూయర్స్ వేరు, క్రిటిక్స్ వేరు. ఇద్దర్నీ కలపకూడదు. నిజానికి సినిమాకొచ్చే ఆడియన్స్ ఎవరూ అనలైజ్ చేయడానికి రారు. ఒక పాప్ కార్న్, కూల్ డ్రింక్ తో, జస్ట్ ఎంజాయ్ చేయడానికే సినిమా. బోర్ కొట్టిందా, లేక ఎంజాయ్ చేశామా అనేదే రివ్యూ. కానీ రివ్యూయర్లు మాత్రం పెన్నూ పేపర్ పట్టుకుని, ఏ సీన్ ఎలా ఉండాలో, ఎడిటర్ ఎక్కడ కట్ చేయాలో చెప్పేస్తుంటారు. పైగా, సినిమాకు వచ్చే ముందే ప్రీకన్సీవ్డ్ నోషన్ తో వస్తున్నారు. రివ్యూయర్ అనే వ్యక్తి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ల ఎక్స్ పీరియన్స్ చెప్పాలి తప్ప సినిమాను డైసెక్ట్ చేసేసి ఇక్కడ మ్యూజిక్ ఇలా ఉండాలి, ఇక్కడ ఎడిటింగ్ ఇలా ఉండాలి అని చెప్పడం నా ఉద్దేశ్యంలో రివ్యూయే కాదు. ఇప్పుడున్న రివ్యూయర్లలో మెజారిటీ మెంబర్స్ కు కనీసం ఎడిటింగ్ గురించి కూడా అవగాహన లేదు. గతంలో ఉన్నరివ్యూ స్టాండర్డ్స్ ఇప్పుడు లేవనేది నా అభిప్రాయం
రష్మిని లాస్ట్ మినిట్ లో తీసుకున్నాం. నిజానికి జబర్దస్ట్ షో జనాలు చూస్తారని తెలుసు గానీ రష్మికి ఇంత ఫాలోయింగ్ ఉందని మాకు తెలియదు. మేమంతా కష్టపడితే, చివరికి ఇది రష్మి సినిమా అయిపోయింది (నవ్వుతూ). కానీ ఫస్ట్ షో పడేవరకూ ఇది రష్మి సినిమా. ఆ తర్వాత సినిమాలోని కంటెంటే జనాన్ని హాల్ కు తీసుకురాగలదు. విషయం లేకపోతే, సినిమాను రష్మే కాదు. ఎవరూ కాపాడలేదు.
గుంటూర్ లో మాయాబజార్ అనే ప్లేస్ ఉంది. దొంగలకు ఫ్యామస్ అయిన స్టువర్ట్ పురం కూడా ఇక్కడికి దగ్గరే. దొంగలు వాళ్లు దొంగతనం చేసి తీసుకొచ్చిన వస్తువుల్ని మాయాబజార్లో అమ్ముతారు. బైక్ వేసుకుని మాయాబజార్లో సామాన్లు కొనడానికి వెళ్తే, కొనుక్కొని వచ్చేలోపు బైక్ ఉండదు. మన బైక్ ను మనమే అక్కడి షాపుల్లో మళ్లీ కొనుక్కోవాల్సి వస్తుంది. అలాంటి మాయాబజార్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు స్టుపిడ్ అండ్ ఇడియాటిక్ దొంగలు చేసిన రచ్చే గుంటూర్ టాకీస్..