English | Telugu
ఇదే నాగార్జున కొత్త సినిమా పేరు
Updated : Mar 2, 2016
ప్రస్తుతం నాగార్జున కెరీర్ మంచి ఊపుమీద ఉంది. మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మల్టీస్టారర్ ఊపిరిలో ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్లో మరో భక్తి రస సినిమా రాబోతోందన్న విషయం తెలిసిందే. వేంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరాం బాబా కథతో రాబోతున్న ఈ సినిమాకు ఓం నమో వెంకటేశా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి షూటింగ్ కు వెళ్లనుంది. రొమాంటిక్ పాత్రలే కాక, భక్తి రస పాత్రల్ని కూడా అవలీలగా పోషించగలనని అన్నమయ్య, రామదాసు లాంటి చిత్రాలతో నిరూపించుకున్నారు నాగార్జున. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చేయబోతున్న ఈ సినిమాకు కూడా అన్నమయ్య రేంజ్ లో అంచనాలుంటాయి. మరి ఆ అంచనాలను ఈ కాంబినేషన్ అందుకుంటుందో లేదో చూడాలి.