English | Telugu
సునీల్ హీరోయిన్ జంపు..!
Updated : Aug 5, 2013
"1000అబద్ధాలు" చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ ఎస్తర్. అయితే అమ్మడు ప్రస్తుతం సునీల్ హీరోగా తెరకెక్కుతున్న "భీమవరం బుల్లోడు" చిత్రంలో ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఈ అమ్మడు అనుకోకుండా లోకేషన్ నుండి కనిపించకుండా పోయిందట. కాసేపటి తర్వాత మెల్లిగా లోకేషన్ కి వచ్చిందట. ఇంతకీ ఈ అమ్మడు ఎక్కడికెళ్ళిందని ఆరా తీస్తే... ఈ అమ్మడు ఈ మధ్య తన పర్సనల్ కాస్ట్యూమర్ తో క్లోజ్ గా ఉంటుందని, అతనితో బయటకు వెళ్లి ఉంటాదేమోనని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఈ విషయంపై చిత్ర దర్శక, నిర్మాతలు చాలా కోపంగా ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రం నుంచి ఎస్తర్ ను తొలగించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. మరి ఈ అమ్మడు ఇకనైనా తన పద్దతి మార్చుకుంటుందో లేదో చూడాలి.