English | Telugu

సుమంత్ హీరోగా రవి చావలి చిత్రం

సుమంత్ హీరోగా దర్శకుడు రవి చావలి ఒక చిత్రం ప్రారంభించనున్నారు. సుమంత్ హీరోగా, ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మించగా, ఇటీవల విడుదలైన "రాజ్" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈసారి రవిచావలి దర్శకత్వంలో సుమంత్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన థ్రిల్లర్ మూవీలో నటించటానికి అంగీకరించారట. ఈ సుమంత్ హీరోగా రవి చావలి చిత్రం వచ్చే నెలలో అంటే ఏప్రెల్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

ఈ సుమంత్ హీరోగా మూవీ ప్రారంభించనున్న రవి చావలి గతంలో సామాన్యుడు వంటి చక్కని చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సామాన్యుడు సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాక ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చినట్టుంది. మరి అలాంటి దర్శకుడు రవి చావలి దర్శకత్వంలో, సుమంత్ హీరోగా నటించే చిత్రం గురించి హీరో సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నారట.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.