English | Telugu

షాకిచ్చిన రాజమౌళి.. 'SSMB29' రిలీజ్ డేట్ లాక్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. కనీసం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వీడియో వచ్చినా చాలని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది.

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు రాజమౌళి. ఇప్పుడు మహేష్ తో చేసేది.. గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఫిల్మ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తెరకెక్కే ప్రాజెక్ట్ కాబట్టి.. షూటింగ్ మొదలైన తర్వాత కూడా సినిమా విడుదల కావడానికి కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశముంటుంది. దాంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందంటే.. ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అలాంటిది మహేష్ మూవీ రిలీజ్ డేట్ ని.. రాజమౌళి ముందే లాక్ చేశారట.

ఈ చిత్రం 'SSMB29' అనే వర్కింగ్ టైటిల్ తో యాక్షన్ అడ్వెంచర్ గా దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027 మార్చి 25న విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారట. ఈ డేట్ కి ఒక ప్రత్యేకత ఉంది. రాజమౌళి గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 25న విడుదలైంది. 2027 మార్చి 25కి 'ఆర్ఆర్ఆర్' విడుదలై సరిగ్గా ఐదేళ్లు పూర్తవుతుంది. దాంతో ఆ డేట్ కి 'SSMB29' రానుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. 'ఆర్ఆర్ఆర్' తో ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా పేరు మారుమోగేలా చేసిన రాజమౌళి.. 'SSMB29'తో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.