English | Telugu

ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరి..ఆర్ఆర్ఆర్ కి మరోసారి దక్కిన గౌరవం   

ప్రపంచ ప్రతిష్టాత్మక సినీ అవార్డు 'ఆస్కార్'(oscar)కి ఉన్న ప్రత్యేకత అందరకి తెలిసిందే.వరల్డ్ సినీనటులు,మేకర్స్,టెక్నీషియన్స్ ఇలా ప్రతి ఒక్కరు తమ సినీ జీవితంలో ఒక్కసారైనా 'ఆస్కార్'ని అందుకోవాలని పరితపిస్తుంటారు.అంతటి ప్రత్యేకత ఉన్న ఆస్కార్ ఇప్పటి వరకు ఎన్నో విభాగాల్లో ఆస్కార్ ని ప్రకటిస్తు వస్తుంది.ఈ క్రమంలోనే స్టంట్ డిజైన్ అనే మరో విభాగాన్ని తన క్యాటగిరిలోకి చేర్చింది.

ఈ విషయాన్నీ అధికారకంగా తెలుపుతు స్టంట్,డిజైన్,ఆస్కార్ పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.అందులో ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ఎట్ వన్స్,మిషన్ ఇంపాజబుల్,ఆర్ఆర్ఆర్(RRR)వంటి మూడు చిత్రాలకి సంబంధించిన స్టంట్ ఇమేజెస్ ని పోస్టర్ లో ఉంచింది.దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో పాటుగా ఆస్కార్ కమిటీ తమ అవార్డ్స్ పబ్లిసిటీ కోసం ఆర్ఆర్ఆర్ ని ఉపయోగించుకోవడం ఇండియన్ సినిమాకి గర్వంగా నిలిచిందంటు కామెంట్స్ చేస్తున్నారు

తాము తీసుకున్న నిర్ణయంపై ఆస్కార్ ప్రతినిధులు స్పందిస్తు చిత్ర నిర్మాణంలో స్టంట్ డిజైన్ ఒక భాగంగా మారింది.ఈ విషయం మూవీ ప్రారంభమైన దగ్గర్నుంచే అర్దమవుతుంది.ఆ విభాగానికి చెందిన సృజనాత్మక కళాకారులని గౌరవించడం మాకెంతో ఆనందంగా ఉందంటు ట్వీట్ చేసింది.2027 నుంచి విడుదలైన చిత్రాలకి స్టంట్ డిజైన్ అవార్డ్స్ ని ఇవ్వనున్నారు.నాటునాటు పాటకి ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ ని అందుకున్న విషయం తెలిసిందే.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.